![]() |
![]() |
.webp)
బుల్లితెరపై అత్యధిక రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ 'కార్తీక దీపం' అనే విషయం అందరికి తెలిసిందే.. కాగా ఈ సీరియల్ శుభం కార్డుకి టైం రానే వచ్చింది. ఈ సీరియల్ ముగుస్తుండటంతో ప్రేక్షకులు నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. వంటలక్క, డాక్టర్ బాబులని చాలా మిస్ అవుతామని.. ఇన్ని రోజులుగా వాళ్ళని మా ఇంట్లో వాళ్ళలాగా భావించామంటూ సోషల్ మీడియాలో అభిమానుల చేసిన పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. ఈ సీరియల్ కోసం కొంతమంది పూజలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ సీరియల్ అంటే జనాల్లో ఎంత క్రేజ్ ఉందో తెలుస్తోంది.
అయితే ప్రేక్షకుల విన్నపం డైరెక్టర్ కి వినపడినట్లే ఉంది కాబోలు.. కార్తీక దీపం సీజన్-2 ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో కూడా డాక్టర్ బాబు, వంటలక్కలదే మెయిన్ రోల్ అంట.. ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినట్లు సమాచారం. 'కార్తీక దీపం' ఈ టైటిల్ కలిసి రావడంతో అదే టైటిల్ తో ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు ఎక్కడ చుసినా "వంటలక్క మ్యానియా ఈజ్ బ్యాక్" అనే ట్యాగ్ లతో సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కార్తీక దీపం సీజన్-2 ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
![]() |
![]() |